Thursday, May 30, 2019

The Radium Girls: The Dark Story of America's Shining Women by Kate Moore


A gripping narrative by Kate Moore that will not let you keep it down until you are done reading. This book is an account of the gut wrenching stories of the young women, their heroic fight for justice and the brutality of capitalism. The author succeeds in taking us to the radium dial paint studios where we see the deterministic young girls meticulously following the instructions lip-dip-paint earning the company a fortune and a deadly mysterious poison for themselves. Their ignorance, the industry's negligence and the indiscriminating powers of the magic element settles down in the bones of these girls disintegrating their lives. The author's powerful narration of the horrendous pain the girls endure brings tears in our eyes. The callousness of the company in recognizing the tragic deaths and denying them of the justice angers us. One cannot stop thinking of the starking reality that the official investigation starts only after the death of the first male person while hundreds of female lives doesn't matter. Their heroic fight and the unwavering will power to stand for their rights against the indifferent industry, dismissive lawyers, courts and doctors even as they lie on their death beds is an example to one and all. All this pain and sacrifice...and yet no memorial until an eighth grade girl champions for the cause and succeeds in honoring the radium girls. Their legacy glows forever illuminating our lives.

Monday, October 10, 2016

ఏదీ గౌరమ్మ ?



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

ఆపువ్వు ఈపువ్వు తెచ్చి ఉయ్యాలో 
ఇంపుగా పేర్చిరె మాయమ్మ ఉయ్యాలో 
కొత్త బట్టలె గట్టి ఉయ్యాలో 
నగలు నట్ర బెట్టి ఉయ్యాలో 
ముద్దుగా ముస్తాబు అయ్యి ఉయ్యాలో
అతివలందరూ గలిసి ఉయ్యాలో 
బతుకమ్మ గౌరమ్మ అంటు ఉయ్యాలో
పాటలె పాడిరి ఉయ్యాలో 
ఆటలె ఆడిరి ఉయ్యాలో 
పండగే జేసిరీ ఉయ్యాలో

పండగంటేమిటి ఉయ్యాలో 
బతుకు నిచ్చు పండగంటు ఉయ్యలో 
బతుకు నివ్వమంటు కొలిస్తివి ఉయ్యలో 
ఇదియేన పండుగా ఉయ్యాలో 
ఇంతేన పండుగ ఇంతి ఉయ్యాలో

నాటి నైజాము కాలాన ఉయ్యాలో 
నీ గుడ్డలూడదీసిన నాడు ఉయ్యాలో 
నిన్ను నగ్నంగ ఆడమన్ననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెల్లిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

అన్ని తానై నిన్ను ఏలుకుంటానన్న ఉయ్యాలో 
తాగివచ్చి నీ మొగుడు ఉయ్యాలో
నిన్ను తన్నినా నాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

గౌరమ్మ గౌరమ్మ అంటు ఉయ్యాలో 
మమ్ము కనికరించుమంటు ఉయ్యాలో 
మస్తుగా బాడినావు ఉయ్యాలో 
మరి ఏమైనాదమ్మ మాయమ్మ ఉయ్యలో

పంటలె పండకా ఉయ్యాలో 
పోలములే ఎండినా ఉయ్యాలో 
అప్పులే కట్టలేక ఉయ్యాలో 
నీ అన్నదమ్ములు ఉరేసుకున్ననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

అమ్మ ఆకలంటు ఉయ్యాలో 
అయ్యొ ఆడుకోవలసిన నీ పిల్లలుయ్యాలో
అలమిటిస్తున్న నాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

పోయిరా నాబిడ్ద అంటు ఉయ్యాలో 
అత్తింటికే పంపితీవి ఉయ్యాలో
కట్నమేదని ఉయ్యాలో 
కర్కషంగ గాల్చిననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

నా తెలంగాణ నాదంటు ఉయ్యాలో 
నీ బిడ్డలసువులు బాసిననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

మన దగ్గర బడ్జెట్ లేదంటు ఉయ్యాలో 
సదువు జెప్పాల్సిన సర్కారు బడులనూ ఉయ్యాలో 
మూర్ఖంగ మూసిననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

ప్రాజెక్టులు గడ్తనని ఉయ్యాలో 
నీకు మారు మార్గం జూపక ఉయ్యాలో 
పంటలు పండె నీ భూములను ఉయ్యాలో 
పాపాత్ములు దీసుకున్ననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ అంటు ఉయ్యాలో 
గిన్నీసు బుక్కంటు ఉయ్యాలో 
పైసలె పారబోసిరుయ్యాలో 
అర్థం లేని ఆర్భాటం జేసిననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

అందరూ గలిసి ఆడ వలసిన బతుకమ్మనూ ఉయ్యాలో
నీ కులము నాది గాదంటు ఉయ్యాలో 
తోటి వారిని తక్కువ జేసిననాడు ఉయ్యాలో 
ఎక్కడి కెలిందమ్మ గౌరమ్మ ఉయ్యాలో 
ఏమి జేసిందమ్మ నీ గౌరమ్మ ఉయ్యాలో

నీకష్టం నీనష్టం నీది గాదా ఉయ్యాలో
అది మర్చి నువ్వు ఉయ్యాలో
ఏవరిమిదో ఆదార పడేవు ఉయ్యాలో
వీరు వారందరూ ఉయ్యాలో
మనవారే గాదా ఉయ్యాలో
ఇంగితమె మర్చేవు ఉయ్యాలో
తెలుసుకో నా తల్లి ఉయ్యాలో
తెలుసుకొని ఆడవె మాయమ్మ ఉయ్యాలో
తేరుకో నా చెల్లి ఉయ్యాలో
తేరుకొని పాడవె మాయమ్మ ఉయ్యాలో

చేయి చేయి కలిపి ఉయ్యాలో 
చప్పట్లు కొట్టండి ఉయ్యాలో 
చెలిమితొ మనము ఉయ్యాలో 
చేయలేనిదేమి లేదు ఉయ్యాలో 
అదికదా పండుగ ఉయ్యాలో 
అందరి పండుగా ఉయ్యాలో 
ఆడుదాం పాడుదాం ఉయ్యాలో

***************

బతుకమ్మ



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

బంతిపూలు నీకు ఉయ్యాలో
   బంగరు మనస్సు మాకు ఉయ్యాలో

గునుగ్పూలు నీకు ఉయ్యాలో
   మంచి గునములు మాకు ఉయ్యాలో

కట్లపూలు నీకు ఉయ్యాలో
   కాంతి మార్గం మాకు ఉయ్యాలో

చిట్టి చామంతులు నీకుఉయ్యాలో
   చదువు సంధ్యలు మాకు ఉయ్యాలో

తంగేడు పూలు నీకు ఉయ్యాలో
   తెలివి తేటలు మాకు ఉయ్యాలో

దానిమ్మ పూలు నీకు ఉయ్యాలో
   ధీటైన ధైర్యము మాకు ఉయ్యాలో

పట్టుకుచ్చు పూలు నీకు ఉయ్యాలో
   పదునైన పౌరుషం మాకు ఉయ్యాలో

కాకర పూలు నీకు ఉయ్యాలో
   కరుణ కాఠిన్యాలు మాకు ఉయ్యాలో

గుమ్మడీ పూలు నీకు ఉయ్యాలో
   గౌరవ మర్యాదలు మాకు ఉయ్యాలో

బీర పూలు నీకు ఉయ్యాలో
   బద్రత బాధ్యతలు మాకు ఉయ్యాలో

నూకలా పువ్వు నీకు ఉయ్యాలో
   నలుగురీ మెప్పు మాకు ఉయ్యాలో

గోరంట పూలు నీకు ఉయ్యాలో
   గొప్ప గుర్తింపు మాకు ఉయ్యాలో

అన్ని పూలు నీకు ఉయ్యాలో
   ఆత్మస్థైర్యం మాకు ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

   

Thursday, October 6, 2016

నిర్జన వారధి



"నిర్జన వారధి " - కొండపల్లి కోటేశ్వరమ్మ 

మొన్నటి నా ఇండియా ట్రిప్ లో హైదరాబాదు బుక్ ట్రస్ట్ లో పుస్తకాలు వెతుకుతున్నప్పుడు ఈ పుస్తకం నాకు తటస్థ పడింది. పుస్తకం పేరులోనే ఎదో నిగూడార్దం ఉందనిపించి ఎవరు రాసారబ్బా అని చూసాను. "కొండపల్లి కోటేశ్వరమ్మ" అని కనిపించింది. కొండపల్లి ఇంటి పేరు ఎక్కడో విన్నట్టు ఉందే అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. కొండపల్లి బొమ్మలను దాటి నా స్మృతులు నాకు సహకరించలేదు. పక్కనే ఉన్న మా బాపుని అడిగివుంటే ఠక్కున చెప్పుండేవాడు. కానీ ఎందుకో అడగలేదు. పుస్తకం మీదున్న ఆవిడ ఛాయాచిత్రంలో అంతులేని ఆత్మస్త్థెర్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

మనకి ఏవైనా కష్టాలొచ్చినప్పుడో, ఇబ్బందులు ఎదురైనప్పుడో మనం తీసుకునే నిర్ణయాలు, వేసే అడుగులు, అలాగే ఎవ్వరూ మనన్ని గమనించనప్పుడు మనం చేసే పనులే మన నిజ స్వభావాన్నీ తెలియ జేస్తాయని నా నమ్మకం. పుస్తకం వెనకట్ట మీద ఓల్గా గారు రాసిన రెండు వాక్యాలు ("ఒక వ్యక్తి జీవితంలో ఇంత దుఃఖం ఉంటుందా అని మనస్సు అర్ద్రమవుతుంది. ఆ దుఃఖం ఎంత వ్యక్తిగతమో అంత సామాజికం, రాజకీయం ... ") చదివిన తరువాత ఈ పుస్తకం తప్పక చదవాలని నిర్ణయించుకున్నాను.

ఒక బాల వింతతువు అని తెలియకుండానే మొదలైన ఆమె ప్రస్థానం కొండపల్లి సీతారామయ్య భార్యగా, సంఘ సంస్కర్తగా, నిస్వార్థ ఉద్యమ కారిణిగా, క్రియాశీల కాళాకారిణిగా, రచయిత్రిగా, భర్త తిరస్కారానికి గురైన భార్యగా, పిల్లల్ని కోల్పోయిన మాతృమూర్తిగా, మొక్కవోని పట్టుదలతో చదువుని పూర్తి చేసి తనదైన శైలిలో ఉద్యోగా బాధ్యతలు నిర్వహించి పలువురి మన్ననలందుకున్న ఉద్యోగిగా వైవిధ్య భరితమైన జీవితం ఆవిడది. పుస్తకం చదివిన మనసున్న వారికి కళ్ళు చెమర్చక తప్పవు.

మూడు ఉద్యామాలల్లో (సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టొద్యమం) పాల్గొని వాటికి పట్టుకొమ్మగా నిలిచి తన ముందు తరానికి, తన తరువాతి తరానికి వారధిగా నిలిచి ఆ వారధి పై నుండి తన అనుకున్న వాళ్ళు ఒక్కొక్కరుగా వెళ్లిపొతే నిర్జన వారధిగా మిగిలారని అర్ధమౌతుంది.

మనిషి జీవితం కష్టసుఖాల సంగమం అయితే ఆ రెండింటిని సమంగా స్వీకరించగల స్దితప్రజ్ఞత చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఆ స్దితప్రజ్ఞతకు నిలువుటద్దం కోటేశ్వరమ్మ గారు.

స్త్రీలు క్రియాశీల రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎలాంటి పాత్రను నిర్వహించగలరో, వారి రాజకీయ బాంధవ్యాన్ని నిర్వచించడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. చదువు,ఉద్యోగం ఒక స్త్రీకి ఎంత అవసరమో, కష్ట కాలంలో హఠాతుగ్గా అందరు తనని ఒంటరిని చేసినప్పుడు ఆ చదువు ఉద్యోగం ఎలా అండదండలవుతాయో చెప్పడానికి ఆవిడ జీవితం ఒక చక్కని ఉదాహరణ. చదువు ఉద్యోగంతో పాటు ఆత్మగౌరవం,ఆత్మాభిమానం ఎంత అవసరమో చక్కగా చాటి చెప్పే పుస్తకం ఇది.

ఈ పుస్తకంలో ఆవిడ జీవిత స్మృతులతో పాటు ఆవిడకి ఆదర్శప్రాయమైన ఆనాటి నాయకులపై, సాహిత్యం పై కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం నుండి వ్యక్తులు, రాజకీయ పార్టీలు, మార్పును అభిలషించే సహృదయులు, ఆ పరంపరలో ముఖ్యమైన మాతృక పోషించే నాయకులు ఎంతో స్ఫూర్తిని పొందవచ్చు. ఓల్గా గారన్నట్టు ఈ పుస్తకం విలువైన పుస్తకం, విలువలు నేర్పే పుస్తకం .

Thursday, July 23, 2009

సుహాస్ birthday wishes and rules

నాకు ఇద్దరు చిచ్చర పిడుగులు. సాత్విక్ కి 6, సుహాస్ కి 4 yrs. అప్పుడప్పుడు వీళ్ళ సంభాషణలు ముద్దొచ్చేవిగా, ఆశ్చర్య పరిచేవిగా ఇంకా అలొచించేవి గా కుడా వుంటాయి..
మచ్చు కి ప్రస్థుతానికి ఒకటి...
మా పిల్లల్ని day care లో drop చెయ్యడానికి వెల్తున్నప్పుడు car లో వాళ్ళ సంభాషణ
*******************************************************************************
సాత్విక్: సుహాస్ నీ Happy Brithday కి నీను ఏం gift ఇవ్వాలి ?
సుహాస్: ....(కొద్ది సేపు ఆలోచించి) I don't Know అన్నయ్య ...you just make me happy...that's it.

సాత్విక్: ohh..come on suhas you tell me how can I make you happy?
సుహాస్: ....(మళ్ళీ కొద్ది సేపు ఆలోచించి) Ok అన్నయ్య you build me a castle and then fill it with lots of balloons. Buy me a yummy birthday cake and lots of gifts...pokemon cards, bakugans, DS cheat game and take me to Toysorus...Its going to be my day, so you guys listen to my rules...

సాత్విక్: wow thats too much suhas.. where do I get money for all those? I only have 128 dollars and 51 cents.
సుహాస్: You don't know అన్నయ్యా (వింతాగ మొహం పెట్టి)...I have to tell you or what..You can take it from mummy's purse(నా news గొడవలో నీను ఉన్నాననుకున్నడో ఏమో)...
అప్పుడు mummy అన్నదంతా...cut ..cut ...cut :)

సరే కొద్ది సేపు అయిన తరువాత... ఇంతకీ వీడి rules ఎంటో కనుకుందామని ..."ok...సుహాస్ rules ఏంటి నాన్నా? " అన్నా. అడిగిందే తడువుగా వాడు "I get to do what I want..mummy!"... "అదేరా what do you want to do? " ఏం చెప్తాడో నని ఆత్రుతగా అడిగా. "ok mummy...here u go... no స్నానం no brushing, playing all day with DS and I wear what I want....ఇంకా ఏదో అంటుండగానే నాకోసమే అన్నట్టు ఆ day care దగ్గర పడడం నీను వాళ్ళని drop చెయ్యడం అయిపోయింధి. హమ్మయ్యా అనుకుంటూ హాయిగా నవ్వుకుంటూ meeting కి time అయిపోతుంటే పరుగు లాంటి నడకతో office చేరుకున్న.

ఇప్పుడు చెప్పండి వీళ్ళు చిచ్చర పిడుగులా కాదా? ఇక మీరే ఊహించుకొవచ్చు వాడి birthday రోజు నా ఇష్టమైన కష్టాలు. :)