Monday, October 10, 2016

బతుకమ్మ



బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

బంతిపూలు నీకు ఉయ్యాలో
   బంగరు మనస్సు మాకు ఉయ్యాలో

గునుగ్పూలు నీకు ఉయ్యాలో
   మంచి గునములు మాకు ఉయ్యాలో

కట్లపూలు నీకు ఉయ్యాలో
   కాంతి మార్గం మాకు ఉయ్యాలో

చిట్టి చామంతులు నీకుఉయ్యాలో
   చదువు సంధ్యలు మాకు ఉయ్యాలో

తంగేడు పూలు నీకు ఉయ్యాలో
   తెలివి తేటలు మాకు ఉయ్యాలో

దానిమ్మ పూలు నీకు ఉయ్యాలో
   ధీటైన ధైర్యము మాకు ఉయ్యాలో

పట్టుకుచ్చు పూలు నీకు ఉయ్యాలో
   పదునైన పౌరుషం మాకు ఉయ్యాలో

కాకర పూలు నీకు ఉయ్యాలో
   కరుణ కాఠిన్యాలు మాకు ఉయ్యాలో

గుమ్మడీ పూలు నీకు ఉయ్యాలో
   గౌరవ మర్యాదలు మాకు ఉయ్యాలో

బీర పూలు నీకు ఉయ్యాలో
   బద్రత బాధ్యతలు మాకు ఉయ్యాలో

నూకలా పువ్వు నీకు ఉయ్యాలో
   నలుగురీ మెప్పు మాకు ఉయ్యాలో

గోరంట పూలు నీకు ఉయ్యాలో
   గొప్ప గుర్తింపు మాకు ఉయ్యాలో

అన్ని పూలు నీకు ఉయ్యాలో
   ఆత్మస్థైర్యం మాకు ఉయ్యాలో

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో

   

No comments:

Post a Comment